నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సురేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో సురేష్ బాబు టికెట్ రేట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో థియేటర్ల పరిస్థితి తెలంగాణతో పోల్చి చూస్తే దారుణంగా ఉందని సురేష్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల్లో చిన్న సవరణలు అడిగినా చేయడం లేదని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.
ఏపీలో సింగిన్ స్క్రీన్ థియేటర్లకు సినిమాలపై పైసా కూడా లాభం ఉండదని ఏసీ థియేటర్లను 40 రూపాయల టికెట్ తో నడిపితే కరెంట్ బిల్లుకు సరిపడా డబ్బులు కూడా రావని సురేష్ బాబు కామెంట్లు చేశారు. థియేటర్లు తెరిచిన తర్వాత ప్రభుత్వం టికెట్ రేట్లలో మార్పులు చేస్తామని చెబుతోందని ఏపీలోని థియేటర్ల యజమానులకు ఇది జీవన్మరణ సమస్య అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. కరోనా రాకపోయి ఉంటే ఓటీటీ పాపులర్ అయ్యేది కాదని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఓటీటీలపై దృష్టి పెట్టారని కరోనా వల్ల ఎగ్జిబిటర్లు ఎక్కువగా నష్టపోయారని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. వాడని విద్యుత్ కొసం 15 నెలలుగా బిల్లులను చెల్లించాల్సి వస్తోందని ఓటీటీ వల్ల థియేటర్ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉందని సురేష్ బాబు వెల్లడించారు. ఓటీటీ సినిమా ఇండస్ట్రీని కాపాడిందని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్