తెలుగు సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన “మెంటల్ మదిలో” సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. మెంటల్ మదిలో విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సెలెబ్రేషన్స్‌ను కొనసాగిస్తూ గురువారం రామానాయుడు స్టూడియోలో ఎనాలసిస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి ఇది మంచి టైటిల్ అని మేము అనుకున్నాం.
కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి కరెక్ట్ టైటిలే కాదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకులే కదా సినిమాను ఆదరించేది. అందుకే ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ మూవీగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మొదటగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా మంది నిజాలను కార్పెట్ కింద దాచేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా ప్రమాదం. చాలా మంది సక్సెస్ మీట్‌లు పెడుతున్నారు. అసలయిన సక్సెస్ మీట్ అంటే ఏంటో అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు” అని అన్నారు. అంతేకాదు సినీపరిశ్రమలో అనేక సమస్యలున్నాయని, వాటిని కలిసి కట్టుగా పరిష్కరించకపోతే పెద్ద గొడవ అవుతుందని హెచ్చరించారు.
https://www.youtube.com/watch?v=sTHSYg_Vif0