Suriya: కోలీవుడ్‌లో మరో లాంగ్‌ వెయిటింగ్‌ కాంబో రిపీట్‌.. సూర్యతో ఆ హీరోయిన్‌!

కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో లాంగ్‌ వెయిటింగ్‌ కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. దశాబ్దాల క్రితం కలసి నటించిన వాళ్లు, కలసి పని చేసిన వాళ్లు ఇప్పుడు మరోసారి కలుస్తున్నారు. ఈ లిస్ట్‌లో సూర్య  (Suriya) , త్రిష (Trisha)కూడా చేరనున్నారు. ఆర్‌జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందులోనే త్రిషను కథానాయికగా ఎంపిక చేశారు అని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని చెబుతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ‘కంగువ’ (Kanguva) సినిమా దారుణమైన పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

Suriya

ఇప్పుడిప్పుడు షాక్ నుండి కోలుకుంటున్న సూర్య త్వరలో కార్తిక్‌ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సినిమా సెట్‌లోకి అడుగుపెడతాడు అని అంటున్నారు. తుది దశకు వచ్చిన ఆ సినిమాను వేగంగా పూర్తి చేసిన ఆర్జే బాలాజీ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఈ క్రమంలో కాస్టింగ్ పనులు షురూ చేశారు. అలా సూర్య – త్రిష కాంబినేషన్‌ చర్చలోకి వచ్చింది. ఈ ఇద్దరూ తొలిసారి ‘మౌనం పేసియాదే’ (ఆడంతే అదోటైపు) అనే సినిమాలో 2002లో నటించారు.

ఆ తర్వాత 2004లో ‘యువ’లో (Yuva) కలసి నటించారు. మూడోసారి ‘ఆరు’ సినిమాలో 2005లో కలసి నటించారు. అయితే ‘ఆరు’లో జోడీనే ఇంకా ప్రేక్షకుల కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. ఆ సినిమాలో పాటలు, వారిద్దరి నటనే దీనికి కారణం. ఇప్పుడు సుమారు 20 ఏళ్ల తర్వాత నాలుగోసారి ఈ సినిమాలో నటిస్తున్నారట. త్రిష కెరీర్‌ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వచ్చి మొత్తం పరిస్థితిని మార్చేసింది.

అప్పటి నుండి ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా ఆమె చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, మోహన్ లాల్ లాంటి సీనియర్లతో నటిస్తోంది. ఇప్పుడు సూర్య కూడా ఆ లిస్ట్‌లోకి దాదాపుగా వచ్చేశాడు అని చెప్పాలి. ఆమె జోరు చూస్తుంటే ఇలాంటి కాంబోలు మరిన్ని కుదిరేలా కనిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus