Suriya: మనీ హీస్ట్ లెవెల్లో అట్లూరి దోపిడీ!

సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన నటనతో సత్తా చాటుతున్న కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే తెలుగులో పలు డబ్బింగ్ చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నటుడు, ఇప్పుడు వెంకీ అట్లూరి (Venky Atluri)   దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ దోపిడీ ఆధారంగా హై ఓక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ కావొచ్చని టాక్.

Suriya

కొంతమంది దీన్ని “మనీ హీస్ట్” వెబ్‌సిరీస్ తరహా కథ అని చెబుతుండగా, ఇదేమాత్రం కేవలం బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్‌ మాత్రమే కాదని, ఇందులో ట్విస్ట్‌లు, హై లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. వెంకీ అట్లూరి మునుపటి సినిమాలకంటే ఇది పూర్తిగా భిన్నమైన డార్క్ యాక్షన్ డ్రామా అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ అట్లూరి ధనుష్ (Dhanush)  , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వంటి స్టార్ హీరోలతో వరుసగా హిట్స్ కొట్టాడు.

ఇప్పుడు వారిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మల్టీస్టారర్‌గా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌లో తెలుగు నుంచి కూడా ఓ పెద్ద హీరో ఉండే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు చందూ మొండేటి  (Chandoo Mondeti) కూడా సూర్యతో భారీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఇటీవల తండేల్ (Thandel)  సినిమాతో మరో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు సూర్య కోసం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం.

దీనిని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సూర్య ముందుగా ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో క్లారిటీ త్వరలోనే రాబోతుందట. ఈ రెండు సినిమాలూ సూర్య తెలుగు మార్కెట్‌ను మరింత పెంచే ప్రాజెక్ట్స్ అవుతాయనడంలో సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus