‘ఆకాశం నీ హద్దురా’ చెప్పిన టైమ్ కి వస్తుందా..?

దక్షిణాది నుండి ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోన్న పెద్ద సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ‘సూరారై పొట్రు’ అనే పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందించారు. డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న విడుదల చేయాల్సవుంది. కానీ కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలొచ్చాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఈ సినిమాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సూర్య ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద తెరకెక్కించిన చిత్రాల్లో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని నెగెటివ్ గా చూపించారనే నేపథ్యంలో సూర్య సినిమా మీద దృష్టి పెట్టారు. ఎన్వోసీని జారీ చేయడంలో ఆలస్యం జరగడంతో సినిమాను వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుండి ఎన్వోసీ వచ్చేసిందని తెలుస్తోంది. అంటే సినిమా రిలీజ్ కు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లే.

ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ఈ సినిమా ముందుగా చెప్పినట్లు.. అక్టోబర్ 30న విడుదల చేస్తారా..?లేదా ..? అనే విషయంలో క్లారిటీ లేదు. సూర్య ఆలోచనలు ఇప్పుడు వేరుగా ఉన్నాయని.. దీపావళికి సినెమా రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అదే సమయానికి విశాల్ ‘చక్ర’, ‘లక్ష్మీబాంబ్’ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఈ పోటీ వాతావరణంలో సూర్య తన సినిమాను రిలీజ్ చేస్తాడా..? లేక సోలో రిలీజ్ చేసుకుంటారో చూడాలి!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus