Kanguva: బాహుబలి వార్ సీన్స్ ను మరిపించేలా కంగువా సీన్స్.. ఏమైందంటే?

సూర్య (Suriya) హీరోగా శివ (Siva) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువా  (Kanguva) సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా అక్టోబర్ లో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ఒక సీన్ కోసం ఏకంగా 10 వేల మంది పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది.

బాబీ డియోల్ (Bobby De0l) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా పది వేల మందితో తీసిన వార్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని బాహుబలి (Baahubali) వార్ సీన్స్ ను మరిపించేలా ఈ సినిమాలో వార్ సీన్స్ ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సూర్య, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో ఈ వార్ సీన్స్ షూట్ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని భోగట్టా. తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. సూర్య చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఒక రోల్ పాజిటివ్ గా మరో రోల్ నెగిటివ్ గా ఉంటుందని సమాచారం అందుతోంది. సూర్యకు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ సక్సెస్ అవసరమనే సంగతి తెలిసిందే.

కంగువా సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కంగువా సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. సూర్య ఇతర భాషల్లో కూడా మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కంగువా సినిమాతో సూర్య ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. సూర్య కెరీర్ ప్లానింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus