తమిళ నటుడు సూర్య కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అతని చిత్రాలను తెలుగు ప్రేక్షకులు స్ట్రైట్ మూవీగా భావిస్తుంటారు. విజయాలను అందిస్తుంటారు. ఇలా రెండు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న సూర్య లేటెస్ట్ మూవీ సింగం 3 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని మొదట ఈ నెల 9 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే రామ్ చరణ్ ధృవ రిలీజ్ మూలంగా 23 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు కూడా రిలీజ్ కావడం లేదని సూర్య ఈ రోజు తన ట్విట్టర్ పేజీలో వెల్లడించారు.
“కొన్ని కారణాల వల్ల సింగం 3 మళ్లీ పోస్ట్ పోన్ అయింది. చిత్రం పై వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని పోస్ట్ చేశారు. ఈ చిత్రం వాయిదా పడేందుకు కారణాన్ని సూర్య చెప్పలేకపోయినా తమిళ మీడియా అసలు సంగతిని బయట పెట్టింది. ఈ చిత్రాన్ని ఈ నెల 23 న రిలీజ్ ప్రకటన వెలువడగానే ఆన్ లైన్లో ప్రి రిలీజ్ బుకింగ్ మొదలైంది. అయితే ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ వెబ్ సైట్స్ వారు ఈ చిత్రానికి సంబంధించి గవర్నమెంట్ నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని చెన్నైకు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై హై కోర్టులో ఎస్ 3 చిత్రం నిర్మాతలపై ఓ పిటీషన్ ఫైల్ చేసారు. ఈ విషయమై కోర్టు.. తమిళ నాడు గరవ్నమెంట్ ని, ఎస్ 3 నిర్మాతలను డిసెంబర్ 21 వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో చిత్రం రిలీజ్ ని వాయిదా వేసినట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.