సూర్య రిస్క్ చేస్తున్నాడా??

తమిళ సూపర్ హీరోల్లో ఒకరైన సూర్యకు తెలుగులో సైతం మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన గజని, యముడు, సింగం, ఇలా అన్ని సినిమాలు మంచి హిట్స్ సాధించడమే కాకుండా సూర్య అంటే తెలుగులో మినిమమ్ గ్యారెంటీ అన్న బలమైన భరోసా నిర్మాతలకు ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సూర్య సినిమాలు కాస్త రాంగ్ టర్న్ తీసుకుని ఫ్లాప్స్ బాట పట్టడంతో తన తరువాత వచ్చే సినిమాలపై సూర్య ఫోకస్ పెడతాడేమో అని అందరూ అనుకున్నారు…కానీ సూర్య చేసిన తప్పే మళ్లీ చేస్తున్నట్లు అనిపిస్తుంది సూర్య తాజా సినిమా సింగం3 చూస్తుంటే….గతంలో సూర్య 6 అనే సినిమా తీశాడు….అది బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అందు….ఈ మధ్య 24అనే సినిమాను తెరకెక్కించాడు….అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యకుండా పోయింది.

ఇప్పుడు లేటెస్ట్ గా సూర్య యముడు రెండో సీక్వెల్ కు ఎస్3 అనే టైటిల్ ను పెట్టుకున్నాడు….అసలు టైటిల్ లో ఈ నంబర్ గొడవ ఏంటో, సూర్యకి ఈ నంబర్స్ పై ఉన్న పిచ్చి ఏంటో తెలీదు కానీ…సినిమా హిట్ కావాలంటే సినిమాకు బలమైన టైటిల్ ఉండాలి…అదే క్రమంలో అలా బలమైన టైటిల్ ఉంటేనే మాస్ ప్రేక్షకులు సినిమాకు వస్తారు…మరి అసలే తాజాగా విడుదలైన టీజర్ ఎవరినీ మెప్పించలేకపోయింది. కేవలం కెమేరా హంగులు.. ఊరకొట్టుడు ఫైట్స్ తప్ప వేరే ఏ అట్రాక్షన్ లేదు. అలాంటి క్రమంలో ఈ ఇంగ్లీష్ తో కూడిన టైటిల్ ఎలాంటి రిసల్ట్ ఇస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=_T5rV9h80IE

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus