ఈ ట్వీట్ ఏంటి సూర్య… ఏమీ పట్టనట్టున్నావ్?

కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్లో కూడా సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ‘గజిని’, ‘సింగం’ చిత్రాలు తమిళ్ తో పాటూ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. తమిళ్ లో ప్లాపయిన ‘7 సెన్స్’ ’24’ ‘గ్యాంగ్’ వంటి చిత్రాలు తెలుగులో హిట్టవ్వడం ఆయన క్రేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఇక సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్జీకే’. సెల్వరాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. మే 31న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం కాన్సెప్ట్, సూర్య నటన బాగున్నప్పటికీ సెల్వరాఘవన్ డైరెక్షన్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడమే ఈ ప్లాప్ కు కారణం. అయితే ఈ చిత్రం ఫలితం పై సూర్య పెద్దగా బాధపడుతున్నట్టు లేడు. తాజాగా హీరో సూర్య ట్విట్టర్లో ‘ఎన్జీకే’ ఫెయిల్యూర్ పై స్పందించిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. సూర్య స్పందిస్తూ… ” ‘ఎన్జీకే’ చిత్రం పై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. సూర్య ఇలా స్పందించడం పై ఆయన అభిమానులు కొందరు అయోమయంలో పడ్డారు. ఓ ప్లాప్ సినిమాకి ఇలా అందరికీ ధ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడం పై వారు అసంతృప్తితో ఉన్నారు. ఇక త్వరలోనే సూర్య మరో భారీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కెవి ఆనంద్ డైరెక్షన్లో ‘కాప్పాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus