ఇది కదా దేవి నుండీ కావాల్సింది..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ మధ్యే విడుదల చేసిన టీజర్ సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రం నుండీ ప్రతీ సోమవారం ఓ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిశతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మాస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ .. మహేష్ అభిమానుల్ని అలాగే మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే క్లాస్ ఆడియన్స్ కు అంత కనెక్ట్ కాలేదు.

అయితే ఈరోజు విడుదల చేసిన సెకండ్ సింగిల్ ‘సూర్యుడివో చంద్రుడివో’ పాట మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ‘దేవి శ్రీ ప్రసాద్’ ఈజ్ బ్యాక్ అనే చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతం.. ఇక బి. ప్రాక్ అనే కొత్త సింగర్ తో ఈ పాట పాడించారు. తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడనే చెప్పాలి. విజువల్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయని అర్థమవుతుంది. ఈ పాటలో విజయశాంతి, మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే అవకాశం ఉంది. ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఉంది. మీరు కూడా వినెయ్యండి.


24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus