సుశాంత్ సింగ్ చిన్నప్పుడు కూడా హీరోలానే ఉన్నాడుగా..!

ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటుడు..ఆ చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘పికె’ చిత్రంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు. ఆ చిత్రంలో అనుష్క శర్మ బాయ్ ఫ్రెండ్ గా.. ఓ పాకిస్థానీ కుర్రాడుగా నటించాడు సుశాంత్. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరోగా మారాడు.

‘చిచోరే’ లాంటి చిత్రంలో ‘ఆత్మహత్య చేసుకోవడం అన్నిటికీ సమాధానం కాదు’ అంటూ సుశాంత్ చెప్పిన డైలాగ్ తో ‘నువ్వు ఎందుకు మాట మీద నిలబడలేదు. గుండె పగలకొట్టేశావ్’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. తొలినాళ్లలో సీరియల్స్ లో నటించి.. అంచలు అంచలుగా ఎదుగుతూ వచ్చిన సుశాంత్.. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి ఇంత క్రేజ్ సంపాదించుకున్న సుశాంత్ అంత పిరికివాడు అయ్యి ఉంటాడా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆరడుగుల అందగాడు అయిన సుశాంత్ చిన్నప్పటి నుండీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నట్టు ఈ ఫోటోలు చెబుతున్నాయి. తనకి చిన్నప్పటి నుండీ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశ ఉండేదట. అలా అని చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదని తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుశాంత్ చిన్నప్పటి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus