రోజు వ్యవధిలో మరో వ్యక్తిని కోల్పోయిన సుశాంత్ కుటుంబం!

  • June 16, 2020 / 12:32 PM IST

సుశాంత్ రాజ్ పుత్ అంత్యక్రియలు ఓ ప్రక్క జరుగుతుండగా వారి కుటుంబలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ హఠాన్మరణాన్నిజీర్ణించుకోలేని అతని వదిన సుధాదేవి ప్రాణాలు వదిలారు. బీహార్‌లోని పూర్ణియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబైలో కుటుంబసభ్యులు సుశాంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన జరగడం దురదృష్టకరం. సుశాంత్ మరణవార్త తెలిసినప్పటికీ నుంచి ఆమె అన్నపానీయాలు తీసుకోవడం లేదు. దీనితో ఆమె బాగా నీరసించి మరణించినట్లు తెలుస్తుంది.

రోజు వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వరుస పెను విషాదాల గురించి తెలుసుకున్న అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. ఇక నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు ముంబయిలోని విలే పార్లే శ్మశానవాటికలో నిన్న సాయంత్రం ముగిశాయి. ఈ సందర్బంగా బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ముంబయిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, తమ ఆత్మీయుడి చివరి చూపు కోసం కొందరు వెళ్లారు.

మరి కొందరు ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. అటు సుశాంత్ బాలీవుడ్ పెద్దలు పెట్టిన మానసిక ఒత్తిళ్లు కారణంగా చనిపోయాడని పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ పెద్దలు పరోక్షంగా సుశాంత్ చావుకి కారణం అని ఆరోపిస్తున్నారు. కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి ప్రముఖులు కొన్ని బహిరంగ విమర్శలు చేశారు. నెటిజెన్స్ సైతం బాలీవుడ్ కుటుంబస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus