బాలకృష్ణ 101 సినిమా విషయంలో వీడిన డైలమా
- February 18, 2017 / 10:10 AM ISTByFilmy Focus
గౌతమి పుత్ర శాతకర్ణి విజయం తరవాత నటసింహ నందమూరి బాలకృష్ణ రేంజ్ మారిపోయింది. బడ్జెట్ ని కూడా పెంచారు. ఈ చిత్రం తర్వాత క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీతో సినిమా చేద్దామని బాలయ్య అనుకున్నారు. రైతు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే రైతు కాన్సెప్ట్ తో చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ తీసెయ్యడంతో.. ఆ కథ ను కొంత కాలం పక్కన పెట్టారు. నెల రోజులుగా సీనియర్, జూనియర్ డైరక్టర్లు బాలకృష్ణకు కథలు వినిపించారు. వాటిలో అన్నిటికంటే తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన స్టోరీ బాగుందని సమాచారం. కథ విన్నప్పుడే ఒకే చెప్పేద్దామని అనుకున్నారు. అయితే ఆ డైరక్టర్ ప్రస్తుతం ఫామ్లో లేరని కొంతమంది చెప్పేసరికి ఆలోచనలో పడ్డారు. పైగా మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో పడ్డారు.
తండ్రి సినిమాకి పరిశోధనకు ఎక్కువగా టైమ్ పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే రావాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. తన 101 సినిమా డైరక్షన్ బాధ్యతలు ఆయనకే ఇవ్వనున్నట్లు సమాచారం. అంతగా మెప్పించిన కథ ఏమిటని ఆరా తీయగా.. అది మాస్ మసాలతో నిండిన ఫ్యాక్షన్ స్టోరీ అని తెలిసింది. సో తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫార్ములాతోనే ఇప్పుడు వచ్చేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















