ప్రభాస్ తో ఛాన్స్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించను – స్వర భాస్కర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సహజంగానే అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ. బాహుబలి సినిమాతో ఆ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బ్యూటీలు సైతం ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమా చేస్తే చాలని కలలుకంటున్నారు. ఈ జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా మరో బ్యూటీ తన మనసులోని కోరికని బయట పెట్టింది. రీసెంట్ గా “వీరే ది వెడ్డింగ్” సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి యువకుల మతులు పోగొట్టిన స్వర భాస్కర్.. బాలీవుడ్ హీరోలందరినీ పక్కన పెట్టి ప్రభాస్ తన డ్రీమ్ హీరో అంటోంది. ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడి అనేక సార్లు బ్రేకింగ్ న్యూస్ లో నిలిచిన ఈ బ్యూటీ ప్రభాస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. “బాహుబలి 1 సినిమాని 9 సార్లు, బాహుబలి 2 చిత్రాన్ని 8 సార్లు చూసాను.

బాహుబలి చూస్తున్న సమయంలో ప్రభాస్ కు పడిపోయా. ప్రభాస్ తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ తో ఛాన్స్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించను” అని చెప్పుకొచ్చింది. ఈమె అభిమానం చూస్తుంటే నటించడానికి రెమ్యునరేషన్ కూడా తీసుకునేటట్టు లేదు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలోనైనా స్వర భాస్కర్ పేరు పరిశీలిస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus