పెళ్లివార్తలపై స్పందించిన కొత్త బంగారు లోకం బ్యూటీ

కొత్తబంగారు లోకం చిత్రంలో ఎక్కడా… ఎప్పుడూ అంటూ ముద్దు ముద్దు మాటలతో శ్వేతా బసు ప్రసాద్ ఆకట్టుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంది. కళావర్‌ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించింది. మరిన్ని సినిమాల్లో నటించాల్సి ఉండగా.. వ్యభిచారం కేసులో ఇరుక్కుని కెరీర్ ని పాడుచేసుకుంది. ఆ తర్వాత వెండితెరకి దూరమైనా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ లో ఒక్కో సినిమా చేస్తోంది. ఈమెపై తాజాగా పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయాన్నీ శ్వేతా బసు ప్రసాద్ ముందు ఉంచగా క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌తో తాను గత నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నానని, అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. “అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్‌ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు. మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు నిజమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు” అని శ్వేత స్పష్టం చేసింది. మరి పెళ్లి తర్వాత నటన కొనసాగిస్తుందా? ఇంటికే పరిమితమవుతుందా? అనేది త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus