‘చాణక్య’ పై ‘సైరా’ ఎఫెక్ట్ గట్టిగానే పడింది..!

సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తుంది అంటే.. అందులోనూ అది పాన్ ఇండియా సినిమా అయితే.. దానికి దరిదాపుల్లో మరో సినిమాని విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ సెలవులు ఉన్నాయి కదా అని గోపీచంద్ ‘చాణక్య’ సినిమాని ‘సైరా నరసింహారెడ్డి’ కి పోటీగా విడుదల చేశాడు నిర్మాత అనిల్ సుంకర. ‘వేటాడు వెంటాడు’ ఫేమ్ తిరు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలైంది. కొందరు సెలెబ్రిటీలు ఈ చిత్రం బాగుందని ట్వీట్లు చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం ప్లాప్ టాక్ చెప్తున్నారు.

యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథ , డైరెక్షన్లో దమ్ము లేదని వారు చెబుతున్నారు. ఇక బుకింగ్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి. ఈ చిత్రం ‘సైరా’ కలెక్షన్ల పై ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటే.. ‘సైరా’ ఎఫక్ట్ ఈ చిత్రం పై పడింది. ఓవర్సీస్ లో కూడా ‘చాణక్య’ కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఓ మూడు రోజులు చప్పుడు చేయకుండా కలెక్షన్లు రాబట్టుకునే పరిస్థితి కూడా ‘చాణక్య’ కు కనిపించడం లేదు. ఇక వీకెండ్ కావడంతో ‘సైరా’ బుకింగ్స్ మరింత పెరిగాయి. ఏదేమైనా గోపీచంద్ కు ఈసారి కూడా పెద్ద దెబ్బే తగిలిందని చెప్పాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus