మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల కాబోతుంది. తన తండ్రి డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి మెగాస్టార్ కొడుకు రాంచరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక విడుదల తేదీ దగ్గరవుతుండడంతో ప్రమోషన్లని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే మేకింగ్ వీడియో,టీజర్, ట్రైలర్ లను విడుదల చేయగా వాటికి అద్భుతమైన స్పందన లభించింది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఇప్పటికే అదిరిపోయే రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటీకే థియేట్రికల్ హక్కులను 190 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇక ‘సైరా’ శాటిలైట్, డిజిటల్ హక్కులు కలిపి ఏకంగా 125 కోట్లకు అమ్మినట్టు తాజా సమాచారం. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలను మినహాయిస్తే మరే సౌత్ సినిమాకి ఈ రేటు పలకలేదు. ప్రముఖ ‘జీనెట్ వర్క్ సంస్థ’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలకు సంబంధించి ‘సైరా’ హక్కులను 125 కోట్లకు కొనుగోలు చేసిందట. తెలుగు వెర్షన్ కు 40 కోట్లు, మిగిలిన భాషలు కలిపి 85 కోట్లు చెల్లించారట. మెగాస్టార్ చిరంజీవితో పాటు నయనతార, అనుష్క, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా, నిహారిక వంటి బడా క్యాస్టింగ్ ఉన్నారు కాబట్టి అంత పెద్ద మొత్తం పెట్టి వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి