బాలీవుడ్ లో హీరో, హీరోయిన్ల మధ్య అసమానతలు విషయంపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎవరూ బయటకు మాట్లాడరు. అలాంటిది తాప్సీ ఈ అంశంపై మాట్లాడి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో బాలీవుడ్ లో ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన అసంతృప్తిని బయటపెట్టింది. రీసెంట్ గా బాలీవుడ్ లో సీత పాత్ర పోషించడానికి కరీనా కపూర్ రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో హీరోల రెమ్యునరేషన్ పై స్పందించని వాళ్లు.. హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ తాప్సీ నిలదీసింది. మహిళా నటులు రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగితే అదో పెద్ద సమస్యగా తయారవుతుందని చెప్పింది. అదే ఎవరైనా హీరో రెమ్యునరేషన్ పెంచితే మాత్రం అతని సక్సెస్ లా అభివర్ణిస్తారని తెలిపింది. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు ఇప్పుడు తనకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని..
గుర్తింపు విషయంలో కూడా అదే వివక్ష అంటూ మండిపడింది. ఈ వ్యత్యాసం రోజురోజుకి పెరిగిపోతుందని.. ప్రేక్షకులు కూడా హీరోలతో పోలిస్తే హీరోయిన్లను తక్కువగానే అభిమానిస్తారని తన అభిప్రాయాన్ని చెప్పింది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!