నేను నటిగా సాధించాల్సింది చాలా ఉంది

తప్పు చేయి కానీ చేసిన తప్పు మ‌ళ్లీ చేయకని చెబుతుంటారు మానసిక వికాస నిపుణులు. ఇదే మాట చెబుతోంది పంజాబీ సుందరి తాప్సీ పన్ను. సినిమాల విషయంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పయితే మళ్లి అలాంటి చిత్రాల దగ్గరకు వెళ్లనంటోంది. ఒక సినిమా అపజయం పాలైతే తన జీవితమేమీ అంతటితో ఆగిపోదని చెబుతోంది. మనసులో ఈ ధైర్యం ఉండబట్టే ఇంతకాలం నాయికగా కొనసాగుతున్నాని చెప్పింది. సినిమాలు ఆడవనే భయం నాకెప్పుడూ లేదు. నేను ధైర్యంగా నటిస్తుంటాను. నాలోని ఆ వ్యక్తిత్వాన్ని మీరు తెరపైనా చూడొచ్చు. ఒక సినిమా ఆడకుంటే అక్కడితో జీవితమేమీ ఆగిపోదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని జాగ్రత్తపడతాను. హిందీతో పాటు వివిధ భాషల చిత్రాలు చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. నట ప్రయాణంలో అందలంలో ఉన్నానని అంతా చెబుతున్నారు.

కానీ సాధించాల్సింది ఇంకా ఉంది. నేను అందనంత ఎత్తులో ఉన్నానంటే ఇంక చేసేందుకు ఏమీ లేదని అర్థం. కానీ నేను చేయాల్సిన గొప్ప పనులు ఇంకా ఉన్నాయి. పరిశ్రమ ఇప్పుడు నాయికలకు అనుకూలంగా ఉంది. గొప్ప గొప్ప పాత్రలు నాయిక ప్రధానంగా తెరకెక్కుతున్నాయి. నేను బాలీవుడ్‌ వచ్చిన ఈ ఆరేళ్లలో తారల ప్రాధాన్యత చాలా పెరిగింది. ఎంచుకోవడానికి విభిన్నమైన చిత్రాలు వస్తున్నాయి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మితం కావడం ఎంతో సంతృప్తినిస్తోంది. అని చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus