Taapsee Marriage: తాప్సి పెళ్లి వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Advertisement

ఇటీవల కొంతమంది హీరోయిన్లు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు అయిన ప్రణీత మరియు యామి గౌతమ్ లు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. ఇదే ఆలోచనలో ఇంకా చాలా మంది హీరోయిన్లు ఉన్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో హీరోయిన్ తాప్సి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు అయిన మ్యాథ్యూస్‌తో తాప్సి ప్రేమ‌లో ఉందని..

త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వీరి పెళ్లి విదేశాల్లో జరుగుతుందని.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తక్కువ మంది సమక్షంలో వీరి పెళ్లి జరుగుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై తాప్సి స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘నేను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని కాబట్టి.. ఇదే రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవ‌డం నాకు ఇష్టంలేదు. మ‌నం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేరు వేరుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

ఇక మాథ్యూస్ విషయానికి వస్తే అతను నాకు మంచి సన్నిహితుడు. అంతే తప్ప అతని పై నాకు వేరే అభిప్రాయం లేదు. అతను చాలా హానెస్ట్ పర్సన్ కూడా..! ప్రస్తుతం నేను సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాను. ఏడాదికి ఆరుకి పైగా సినిమాల్లో నటిస్తున్నాను. ఎప్పుడైతే ఆ సంఖ్య రెండు రెట్లు తగ్గుతుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను” అంటూ క్లారిటీ ఇచ్చింది తాప్సి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus