ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ పొన్ను. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం పలు తెలుగు సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా పలు తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు మాత్రం సరైన హిట్ పడలేదు. దీంతో ఈమె తెలుగు సినిమాలకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయారు.
ఈ మధ్యకాలంలో ఏ విషయం గురించి అయినా (Taapsee) తాప్సి ముక్కుసూటిగా సమాధానాలు చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తాను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఆ తప్పు మొత్తం నాదేనని తనపై ఎన్నో విమర్శలు చేశారు.
తాను దురదృష్టవంతురాలు అంటూ ఆ సినిమా ఫెయిల్యూర్ మొత్తం నా పైనే వేశారు అయితే నేనేమీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి రాలేదు ఎలాంటి కథలు ఎంపిక చేయాలి అనే విషయం తనకు ఏ మాత్రం తెలియదు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నానని తెలిపారు. ఇలా వరుస సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో చాలామంది ఆ తప్పు మొత్తం హీరోయిన్లపైనే తోసేస్తారు.
కానీ సినిమాలో హీరోయిన్స్ నటించేది మాత్రం చాలా తక్కువ సన్నివేశాలలో నటిస్తారని అలాగే కొన్ని పాటలలో మాత్రమే హీరోలు పక్కన రొమాంటిక్గా కనిపించడానికి మాత్రమే హీరోయిన్లను తీసుకుంటారంటూ ఈ సందర్భంగా తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.