కామెంట్లపై మరోసారి కామెంట్‌ చేసిన తాప్సి

‘అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుంటే… ఓకే అంటున్నారు. అదే అబ్బాయిలు పొట్టి బట్టలు వేసుకుంటే ఒప్పుకోరేం’ అంటూ ‘ఆది’ సినిమాలో ఎల్బీ శ్రీరామ్‌తో అలీ ఓ డైలాగ్‌ చెబుతారు. ఆ రోజుల్లో ‘అవును నిజమే కదా’ అనుకున్న యూత్‌ చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి డైలాగే చెబుతోంది కథానాయిక తాప్సి. అయితే ఇక్కడ కాన్సెప్ట్‌ మారింది. ఇప్పుడు తాప్సి మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ తాప్సి ఏమందంటే?

‘‘ఆడవారు బికినీ వేసుకుంటే విమర్శలు చేస్తుంటారు. హాట్‌గా కనిపించినా, ఎక్స్‌పోజింగ్‌ చేసినా… ఏంటీ ఈ డ్రస్ అంటూ కామెంట్లు చేస్తుంటారు. అదే మగవారు స్విమ్‌ డ్రెస్సుల్లో అర్ధనగ్నంగా కనిపిస్తే పెద్దగా పట్టించుకోరుజ ఎందుకు ఇంతగా డబుల్‌ స్టాండర్డ్స్‌’’ అంటూ విరుచుపడింది తాప్సి. అసలు ఇలాంటి విధానం సమాజంలో ఎందుకు ఉంది అంటూ ప్రశ్నిస్తోంది తాప్సి. ఆడ, మగ అనే తేడా ఇక్కడ ఎందుకు చూస్తున్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించింది తాప్సి.

Taapsee about that star actor1

మగవారి డ్రెస్సింగ్‌ విషయంలో విమర్శలు చేయని జనాలు… ఆడవారు వేసుకున్నా, వేసుకోకున్నా దుస్తుల విషయంలో ఎందుకు విమర్శలు చేస్తున్నారు అంటూ వాదిస్తోంది. మామూలుగా తాప్సి సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దుస్తుల విషయంలో కామెంట్లు చేసింది. మరి ఆమెను సపోర్టు చేస్తూ బాలీవుడ్‌లో ఎవరైనా మాట్లాడతారా అనేది చూడాలి. ప్రతి విషయంలో తాప్సిని వ్యతిరేకించే కంగన ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus