గదిలో ఉండేది తమన్నా కాదా..? తాప్సినా?

అంచనాలు లేకుండా వచ్చి ఓ చిన్న సినిమా హిట్టయ్యింది అంటే.. ఆ చిత్రానికి సీక్వెల్స్ చేయడం మొదలుపెట్టేస్తుంటారు. అందులోనూ హారర్ సినిమాలు తీసి హిట్లు కొడితే.. ఆ చిత్రాలకి వరుస సీక్వెల్స్ తీస్తూనే ఉంటారు. దీనికి రాఘవలారెన్సు ను పెద్ద ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. వరుసగా ‘ముని’ సీక్వెల్స్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఓంకార్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ‘జీనియస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్లాప్ అందుకున్న తరువాత ‘రాజుగారి గది’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ తోనే కాకుండా… నాగార్జున క్రేజ్ ను కూడా ఉపయోగించుకుని ‘రాజు గారి గది2’ చేసాడు. ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు ‘రాజుగారి గది3’ కూడా ప్లాన్ చేసాడు.

ఇటీవల ఈ సీక్వెల్ కు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా కూడా నిర్వహించారు. అయితే మొదట తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పోషిస్తున్నట్టు ప్రకటించారు కానీ.. ఎవ్వరూ ఉహించని విధంగా ఆమె తప్పుకుంది. దర్శకుడు ఓంకార్ తమన్నా కు తెలీకుండా స్క్రిప్ట్ లో మార్పులు చేయడమే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తమన్నా ప్లేస్ లో తాప్సి ను తీసుకోవాలని ఓంకార్ భావిస్తున్నాడట. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ‘గేమ్ ఓవర్’ చిత్రంతో సక్సెస్ కూడా అందుకుంది. ప్రస్తుతం ఓంకార్.. తాప్సిని ఒప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇందుకు ఆమె ఒప్పుకుంటుందో లేదా చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus