అందుకే దాని గురించి చెప్పలేను – టబు

బాలీవుడ్ బ్యూటీ టబు ప్రేమదేశం చిత్రంతో యువకుల హృదయరాణిగా స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి విజయాలను అందుకున్నారు. అలాగే టబు చిరంజీవి, బాలకృష్ణ తదితరులతో మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో చిత్రాలను చేస్తున్నారు. ఆమె రీసెంట్ గా నటించిన “గోల్‌మాల్‌ ఎగైన్‌” రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను హోస్ట్ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. అదే పెళ్లి గురించి. 46 వచ్చినా టబు పెళ్లిచేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగగా ఆమె కోపంగా సమాధానం ఇచ్చారు. “నేను ఒంటరిగానే ఉంటున్నాను.. ఇంకా ఏమైనా అడగాల్సి ఉందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పెళ్లి చేసుకోనందుకు బాధపడడం లేదని, సింగిల్‌గా ఉండడమే బాగుంది. ప్రతీ క్షణాన్ని ఇలా గడపడానికి ఇష్టపడుతున్నాను”అని స్పష్టం చేశారు. పోనీ పెళ్లి చేసుకోవడం మంచిదా? చెడ్డదా? అన్న విలేకరుల ప్రశ్న టబుకి మరింత చిరాకు తెప్పించింది. “నేను ఇప్పటి వరకు రెండో వైపు (పెళ్లి) చూడలేదు. కాబట్టి ఇది బాగుందా?, అది బాగుందా? అనే విషయాన్ని ఎలా చెప్పగలుగుతాను. పెళ్లిని అనుభవించిన తర్వాత మాత్రమే ఏది బాగుందనే విషయాన్ని చెప్పగలుగుతాను. నేనైతే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి మంచి, చెడు గురించి నాకు తెలియదు” అని చెప్పి వెళ్లిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus