టబు పెళ్లి చేసుకోకపోవడానికి అతనే కారణమట!

పాతిక నిండగానే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ప్రస్తావన వస్తుంది. ముప్పై దాటితే అది ఒత్తిడిగా మారుతుంది. నలభై ఆరు ఏళ్ళు నిండినా టబు మాత్రం పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా జీవిస్తోంది. ప్రేమదేశం, నిన్నే పెళ్లాడుతా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి టబు కనిపించినప్పుడల్లా విలేకరులు “మీ పెళ్లెప్పుడు?” అనే ప్రశ్న వేయడం అలవాటు అయిపోయింది. ఈ ప్రశ్నకు టబు ఈ సారి మాత్రం సరదాగా సమాధానం చెప్పింది. తనకు వివాహం కాకపోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అని టబు చెప్పింది. కాజోల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో టబు పెళ్ళికి ఎలా అడ్డుగా మారాడు? అని మరో ప్రశ్న రాక మానదు.

అందుకు ఆమె అడక్కుండానే సమాధానం చెప్పింది. “దాదాపు 25 సంవత్సరాలుగా అజయ్ దేవగన్ నాకు తెలుసు. తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడు.  మేమంతా మంచి స్నేహితులం. ఆ సమయంలో అజయ్ తనను ఓకంట కనిపెడుతూ అనుసరించేవాడు” అని టబు ఆనాటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంది.  ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అయ్యేవాడని, వేరే అబ్బాయిలు ఎవరైనా తన వైపు చూసినా, మాట్లాడినా… వారిని కొట్టి  వార్నింగ్ ఇచ్చేవాడని అసలు విషయం బయట పెట్టింది. అప్పటి నుంచి అబ్బాయిలు తన వైపు చూసేందుకు భయపడ్డారని, అలా తన పెళ్లి కాకపోవడానికి అజయ్ కారణమని స్పష్టం చేసింది.  పెళ్లి చేసుకోనందుకు తనకు ఎలాంటి బాధా లేదని కూడా టబు చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus