40 ఏళ్ళ ఆంటీ అయ్యుండి 25 ఏళ్ళ కుర్రాడితో రొమాన్స్..!

లేడీ డైరెక్టర్ మీరా నాయర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెరకెక్కించే సినిమాలు ఎన్నో వివాదాలకు దారితీస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం ఈమె ఎంచుకునే బోల్డ్ కాన్సెప్ట్ లే అనడంలో సందేహం లేదు. ‘సలామ్ బాంబే’ తో అవార్డులు ఎన్ని వచ్చాయో విమర్శలు, కూడా అదే రేంజ్లో వచ్చాయి. సడెన్ గా ఈమె ‘కామసూత్ర’ అనే సినిమా కూడా తెరకెక్కించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ లేడీ డైరెక్టర్ బీబీసీ వాళ్ళ కోసం ఓ టీవీ సిరీస్ ను తెరకెక్కిస్తోంది. ‘ఏ సూటబుల్ బాయ్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ లో నటి టబు కూడా నటిస్తుండడం విశేషం.

ఇక ఇషాన్ ఖట్టర్ కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నాడు. ‘అప్పటి కాలంలో.. ఒక వరండాలో నాలుగు కుటుంబాలు నివసించిన నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ‘తనకంటే వయసులో పెద్దదైన ఓ మహిళతో కుర్రాడి ప్రేమాయణం’ నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. ఇషాన్, టబు ల మధ్య చాలా ఘాటు రొమాంటిక్ సీన్లు కూడా ఉంటాయని తెలుస్తుంది. 48 ఏళ్ళ వయసులో కూడా ఇంత బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలకు ఓకే చెబుతుంది అంటే టబు సాహసానికి మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ బ్యూటీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus