‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ కొట్టి సూపర్ ఫామ్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మూవీ చేశారు. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 24న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓ అభిమాని దర్శకుడు అయ్యి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంటుంది అని చెప్పొచ్చు. తమిళంలో మురుగదాస్ తెరకెక్కించిన ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్.
కానీ ఆ చిత్రానికి దీనికి అస్సలు పోలిక ఉండదు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు దర్శకుడు వి.వి.వినాయక్ ‘ఠాగూర్’ లో చాలా మార్పులు చేశాడు. క్లైమాక్స్ కూడా మార్చాడు.కాబట్టి ఎక్కడా కూడా రీమేక్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగదు.నిజానికి వినాయక్ చేసిన ఆ మార్పులే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమయ్యాయి అని చెప్పొచ్చు. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 19 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 8.45 cr |
సీడెడ్ | 5.30 cr |
ఉత్తరాంధ్ర | 2.72 cr |
ఈస్ట్ | 1.90 cr |
వెస్ట్ | 1.78 cr |
గుంటూరు | 2.04 cr |
కృష్ణా | 1.65 cr |
నెల్లూరు | 1.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 24.97 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 2.68 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.65 cr |
‘ఠాగూర్’ చిత్రం రూ.18.40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.27.65 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు రూ.9.25 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!