రజనీ సార్ అడిగితే నా సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటా!

ఆడదానికి ఆడదే శత్రువు అనే విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. అదే సామెతను మన ఇండస్ట్రీ పొజిషన్ ప్రకారం, అది కూడా హీరోల మైండ్ సెట్ ప్రకారం మార్చుకుంటే “హీరోకి హీరోనే శత్రువు” అని చెప్పుకోవచ్చు. రిలీజ్ డేట్స్ విషయంలో పోటీపడడం, తమ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటే కాదు తమ సినిమా అంటూ పబ్లిసిటీ చేయించుకోవడం కోసం తెగ పోటీ పడుతుంటారు. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాక బాలీవుడ్ కి ఈ ఏడాది హిట్ ఇచ్చిన ఏకైక అగ్ర కథానాయకుడు అయ్యుండి ఏమాత్రం భేషజాలకు పోకుండా.. “రాజనీకాంత్ గారు ఆయన సినిమాను విడుదల చేస్తానంటే.. నేను నా సినిమా పోస్ట్ పోన్ చేసుకొంటాను” అంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.

ప్రస్తుతం “రోబో 2.0″లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ అదే సమయంలో “ప్యాడ్ మ్యాన్” అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతోపాటు టైటిల్ రోల్ కూడా పోషించారు. ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తానని ఫస్ట్ లుక్ విడుదల రోజునే ప్రకటించిన అక్షయ్ కుమార్.. రజనీకాంత్ “రోబో 2.0” చిత్రాన్ని కూడా జనవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. తన “ప్యాడ్ మ్యాన్” చిత్రాన్ని పోస్ట్ పోన్ చేద్దామని డిసైడ్ అయిపోయాడు అక్షయ్. మళ్ళీ “రోబో 2.0” రిలీజ్ డేట్ మార్చికి మారిందని వార్తలోచ్చేసరికి ఏం చేయాలో తోచని సందిగ్ధంలో పడ్డాడు. ఇదే విషయమై మీడియా ఆయన్ని ప్రశ్నించగా చాలా సింపుల్ గా “రజనీ సార్ “రోబో 2.0” జనవరి 25న విడుదలైతే నా “ప్యాడ్ మ్యాన్”ను పోస్ట్ పోన్ చేసుకొంటాను. ఒకవేళ ఆయన సినిమా మార్చికి పోస్ట్ పోన్ అయితే మాత్రం నా సినిమా జనవరి 25న విడుదల చేస్తాను. అంతా శంకర్ గారి చేతిలో ఉంది” అంటూ హుందాగా సమాధానమిచ్చాడు. ఒక బాలీవుడ్ స్టార్ హీరో అయ్యుండి ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తూ వేరే హీరో కోసం తన సొంత సినిమా ఆపుకోడానికి ముందుకొచ్చిన అక్షయ్ కుమార్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus