సరికొత్త అవతారం ఎత్తనున్న మిల్కీ బ్యూటీ..!

  • July 12, 2019 / 04:41 PM IST

మిల్కీ బ్యూటీ కెరీర్ ప్రారంభం నుండీ గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చింది. చెప్పుకోవడానికి ‘బాహుబలి’ సిరీస్, ‘ఎఫ్2’ తప్ప ఈమె కెరీర్లో బ్లాక్ బస్టర్లు పెద్దగా లేవు. అయినప్పటికీ స్టార్ హీరోలందరి పక్కన నటించేసింది. అయితే కుర్ర హీరోయిన్ల పోటీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఈ తరుణంలో తమన్నా కి ఆఫర్లు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అందుకే సీనియర్ హీరోల పక్కన కూడా నటించడానికి ఓకే చెప్పేస్తుంది. ఇప్పటికే వెంకటేష్ సరసన నటించింది.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే… తమన్నా ఇప్పుడు గ్లామర్ రోల్స్ ను పక్కన పెట్టి.. పూర్తిగా కథా ప్రాధాన్యత ఉండే చిత్రాలనే చేయాలని డిసైడ్ అయ్యిందట. ముఖ్యంగా నయన తార, కంగనా రనౌత్ లా లేడీ సూపర్ స్టార్ లా ఎదగాలని.. అందులోనూ యాక్షన్ సీన్లలో నటించాలని తెగ ట్రై చేస్తుందట.

‘బాహుబలి’ లో యుద్ధ పోరాట సన్నివేశాలలో ఈ అవంతిక అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తమన్నా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న చిత్రంలో నటిస్తుందట. విశాల్ హీరోగా సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నా రిస్కీ షాట్లు చేస్తుందట. ఈ చిత్రం తమన్నా అభిమానులకి పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి. మరి ఈ చిత్రం తమన్నా కెరీర్ కి ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus