Tamanna: తమన్నా కూడా ఆ సమస్యతో బాధపడుతోందట!

తమన్నా.. పరిచయం అవసరం లేని పేరు. అభిమానులు ఈమెను మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.ఒకప్పుడు వరుస ఆఫర్లతో ఈమె ఫుల్ స్వింగ్ లో ఉండేది. నటిగా చెప్పుకోడానికి రెండు, మూడు హిట్లు మాత్రమే ఉన్నా.. ఈమె గ్లామర్, డెడికేషన్ ను బట్టే అవకాశాలు వచ్చాయి అనేది వాస్తవం. ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయినా ఏదో ఒక రకంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆమె ఓ సమస్యతో ఇబ్బంది పడుతుంది.

విషయంలోకి వెళితే.. తమన్నా వయస్సు ఇప్పుడు 34 ఏళ్ళు. ఈ క్రమంలో ఆమె ఫిట్నెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల వచ్చిన ‘జైలర్’ ‘భోళా శంకర్’ సినిమాల్లో ఆమె బొద్దుగా కనిపించింది. ఈ విషయాన్ని తమన్నా కూడా అంగీకరించింది. ‘అవును నేను ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడుతున్నాను. నాలుగు రోజులు జిమ్ కి వెళ్లి వర్కౌట్లు చేయకపోతే కనుక బరువు పెరిగిపోతున్నాను’ అంటూ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

లాక్ డౌన్ టైంలో తమన్నా (Tamanna) కరోనా భారిన పడింది. ఈ క్రమంలో ఆమె రెండు, మూడు వారాల పాటు వర్కౌట్లు చేసింది లేదు. దీంతో ఆమె బరువు పెరిగిపోయింది. ఆ టైంలో తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలపై చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. అయితే ఆమె డెడికేషన్ వల్ల వర్కౌట్లు బాగా చేసి సన్నబడింది. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus