Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

ఒకసారి మనం గీత దాటి మాట్లాడితే.. రేపొద్దున అవతలి వ్యక్తులు అలాగే మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తొలుత అలా మాట్లాడింది.. ఇప్పుడు ఇబ్బందులు ఫేస్‌ చేస్తోంది మాజీ పీఆర్‌ఓ, మాజీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూస్‌, చిన్న నిర్మాత, మధ్య మధ్యలో తిరిగి పీఆర్‌ఓగా మారే ఎస్‌కేఎన్‌ గురించి. చాలా ఏళ్లు మెగా ఫ్యామిలీ చుట్టూ ఉండి, ఆ తర్వాత అల్లు అర్జున్‌కి బాగా సన్నిహితుడుగా ఉన్నారు ఎస్‌కేఎన్‌. మెగా – అల్లు ఫ్యామిలీ హీరోలను ఆయన బాగా అభిమానిస్తారు. ఆయన్ని మెగా ఫ్యాన్స్‌ అలానే అభిమానిస్తూ వచ్చారు.

Skn

అంతలా మెగా – అల్లు ఫ్యాన్స్‌ ప్రేమను పొందిన ఆయన ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అని చెప్పబడుతున్న నెటిజన్ల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఓ రేంజిలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎస్‌కేఎన్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏకంగా ఎస్‌కేఎన్‌ సైబర్‌ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు అని సమాచారం. ‘ప్రభాస్‌ రాజా సాబ్’ సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య వచ్చిన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా ఫలితం అలా అవ్వడానికి కేవలం దర్శకుడు, అతని సన్నిహితులు మాత్రమే కారణం అనేలా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. బూతులతో దర్శకుడు మారుతి, అతని సన్నిహితుడు.. ఆ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ అయిన ఎస్‌కేఎన్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకట్రెండు రోజులు ఇదంతా చూసిన ఎస్‌కేఎన్‌ ఇక ఆగక్కర్లేదు అనుకొని పోలీసులను ఆశ్రయించారు అని చెబుతున్నారు. కొంతమంది కావాలని టార్గెట్‌ చేస్తున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారట.

అయితే, సినిమా విడుదలకు ముందు ఓ ప్రెస్‌ మీట్‌లో ‘జాతిని..’ అని రాసి ఫైర్‌ సింబల్ ఉన్న ఓ టీ షర్ట్‌ వేసుకొచ్చారు ఎస్‌కేఎన్‌. అప్పుడే అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. అది ఓ మీమ్‌ అయినా ఇలా నోరు జారడం మంచిది కాదు అని చెప్పారంతా. ఆ తర్వాత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆవేశంతో ఊగిపోతూ ఏదేదో మాట్లాడేశారు ఆయన. ఇప్పుడు అదే ఆయనకు రివర్స్ అవుతోంది అని చెప్పొచ్చు.

ఆయన బయోపిక్‌లో జెన్నిఫర్‌ లోపేజ్‌ పాట.. అంత స్పెషలేంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus