మెగాస్టార్ తో మిల్కీ బ్యూటీ పోటీ!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సూపర్ డ్యాన్సర్ గా పేరుతెచ్చుకున్న నటి తమన్నా. ఈ భామ నేటి యువ హీరోలందరితో స్టెప్పులేసింది. అదరహో అనిపించింది.  రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను తన స్టెప్పులతో ఓ ఊపు ఊపిన మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడేందుకు మిల్కీ బ్యూటీ ఇప్పుడు సిద్ధమైంది. మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ డైరక్షన్లో చిరు నటిస్తున్న150 వ సినిమా “ఖైదీ నంబర్ 150” షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఈ చిత్రీకరణలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్ని రోజుల క్రితం జాయిన్ అయింది. వీరిపై రొమాంటిక్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో డ్యాన్స్ చెయ్యడానికి సరైనోడు భామ  క్యాథరిన్ థెరిసాను మొదట్లో ఎంపిక చేశారు. తాజాగా ఆమె స్థానంలో తమన్నాను తీసుకోనున్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఆ పాట రేంజ్ పెరుగుతుందని చిత్ర బృందం భావించడంతో ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. తమన్నా ఈ అవకాశాన్ని వదులుకోదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మెగా అభిమానులకు నచ్చేలా ఐటెం సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నిమగ్నమయి ఉన్నారు. కొణిదెల బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150″  సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus