ఇంకెన్నాళ్ళు గ్లామరస్ రోల్స్ తో నెట్టుకొస్తుంది

ఒక హీరోయిన్ కెరీర్ ను నెట్టుకురావాలంటే గ్లామర్, లక్, కాస్తో కూస్తో నటన ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. అదే హీరోయిన్ కెరీర్ ఏదో కొన్నాళ్ళ హడావుడిలా కాకుండా కాస్త ఎక్కువకాలం సాగాలంటే మాత్రం ప్రతిభ కూడా తప్పనిసరి. అందుకు చక్కని ఉదాహరణలు నయనతార, కాజల్ అగర్వాల్, త్రిషలు. కెరీర్ తొలినాళ్లలో కేవలం గ్లామర్ రోల్స్ తో మాత్రమే ఆకట్టుకొన్న ఈ ముగ్గురూ అనంతరం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతోనూ ప్రేక్షకుల్ని అలరించడం మొదలెట్టారు. ఆ విధంగా కాజల్, నయనతార, త్రిషలు లాంగ్ కెరీర్ ను ఏర్పరుచుకున్నారు.

tamanna-stunning-pose1

కానీ.. పైన పేర్కొన్న ముగ్గురు హీరోయిన్లతో సమానమైన క్రేజ్ తోపాటు స్టార్ డమ్ కూడా ఉన్న తమన్నా మాత్రం ఇప్పటికీ కేవలం తన గ్లామర్ ను మాత్రమే నమ్ముకొంటోంది. ఇప్పటికీ నిర్మాతలు కానీ ప్రేక్షకులు కానీ ఆమెను ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గా మాత్రమే చూస్తున్నారు. ఆ కారణంగా తమన్నా లాంటి వర్త్ ఉన్న హీరోయిన్ కెరీర్ ఎప్పటికప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుంది. చేతి నిండా ప్రొజెక్ట్స్ ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా.. అగ్ర కథానాయికల రేస్ లో మాత్రం వెనుకబడిపోతోంది తమన్నా. అర్జెంట్ గా తమన్నా తన గ్లామర్ ను మాత్రమే కాక నట ప్రతిభను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయకపోతే.. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల తాకిడికి తట్టుకోలేక తట్టాబుట్టా సర్దేసుకోవాల్సి వస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus