Tamannaah: పెళ్లి అంటే పార్టీ చేసుకోవడం కాదు..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి తమన్నా!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె లస్ట్ స్టోరీ 2 ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా యాంకర్ తమన్నాను (Tamannaah) ప్రశ్నిస్తూ పెళ్లి విషయంలో ఏదైనా ఒత్తిడికి గురవుతున్నారా అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..పెళ్లి అనేది చాలా ముఖ్యమైన బాధ్యత మనకు నచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు పెళ్లి అనే ఒక బాధ్యతను మనం మోయగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఈమె సూచించారు. పెళ్లి అంటే ఒక పార్టీ చేసుకోవడం కాదు.

పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉండాలి. అందుకే పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తమన్నా సూచించారు.తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంటానని భావించాను. అలాగే 30 సంవత్సరాలకు తాను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలన్న ప్రణాళిక వేసుకున్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో నా ఆలోచనలు మారిపోయాయని తమన్న వెల్లడించారు.

ఇలాంటి విషయంలో ప్రస్తుత జనరేషన్ వారిని చాలా ప్రశంసించాలని ఈమె తెలియజేసారు. మునపటి తరం వారి మాదిరిగా ఒకరిని చూసి మరొకరు అభిప్రాయాలను మార్చుకోవడం లేదని తెలిపారు. తాను కూడా కెరియర్ మొదట్లో పక్కవారి ఆలోచనలకు ప్రభావితం అయ్యేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నాకంటూ సొంతంగా ఆలోచనలు చేసే నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాను అంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus