Jr NTR: ఎన్టీఆర్ తో సినిమా.. ఆ తమిళ దర్శకుడికి సాలిడ్ రెమ్యునరేషన్!

ఇప్పుడు ఇండియన్ సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతుండటంతో, హీరోల రెమ్యునరేషన్ గణనీయంగా పెరిగిపోయింది. కేవలం హీరోలే కాదు, డైరెక్టర్స్ కూడా ఇప్పుడు భారీ మొత్తాలను డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ పెరిగిన తర్వాత, స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఈ లిస్ట్‌లో మరో పేరు బలంగా వినిపిస్తోంది. తాజాగా ఓ స్టార్ దర్శకుడు కేవలం అడ్వాన్స్ రూపంలోనే ఏకంగా 30 కోట్లు తీసుకున్నాడనే వార్త టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Jr NTR

ఇక సినిమా బిజినెస్ ను బట్టి ఆ తరువాత షేర్ అంధించే విదంగా డీల్ మాట్లాడుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తమిళ స్టార్ ఫిల్మ్‌మేకర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip Kumar). డాక్టర్, బీస్ట్ (Beast), జైలర్ (Jailer) వంటి సినిమాలతో తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. నెల్సన్.. ఎన్టీఆర్‌తో (Jr NTR) ఓ భారీ మాస్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సంబంధించి నిర్మాతల నుంచి ఇప్పటికే నెల్సన్ భారీ అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనే దానిపై స్పష్టత లేకపోయినా, ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో వార్ 2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రాజెక్ట్ ఉన్నాయి.

రెండు సినిమాల తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే చర్చలో నెల్సన్ పేరు బలంగా వినిపిస్తోంది. తమిళ మార్కెట్‌లో తన స్థాయిని పెంచుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ కాంబినేషన్‌కి సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus