Jailer Movie: రజనీకాంత్‌ కొత్త సినిమాలకు సీఎం కామెంట్స్‌… ఫొటో వైరల్‌!

దేశంలోని ముఖ్యమంత్రుల్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ రూటే వేరు. తొలిసారి సీఎం అయినవారిలో స్టాలిన్‌ స్టైల్‌ చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరి ముఖ్యమంత్రుల్లా కాకుండా ప్రతి విషయంలో డిఫరెంట్‌గా ఆలోచించి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఆయనకు సినిమాలన్నా చాలా ఇష్టం. మంచి వచ్చింది అంటే… చూసేసి ఆ టీమ్‌ను పిలిచి మెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా స్టాలిన్‌ రజనీకాంత్ కొత్త చిత్రం ‘జైలర్‌’ చూశారు. దీనికి సంబంధించిన ఓ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిది.

రజనీకాంత్‌ హీరోగా, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం (Jailer Movie) ‘జైలర్‌’. తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ‘భోళా శంకర్‌’ సినిమా కాస్త తుస్‌మనడంతో ‘జైలర్‌’కు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, స్క్రీన్ల సంఖ్య పెరిగింది. దీంతో భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నాయి అంటున్నారు. మరోవైపు తమిళనాట అయితే వసూళ్ల సునామే అంటున్నారు. ఈ హుషారును మరింత పెంచేలా సినిమా టీమ్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ మెచ్చుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇటీవల ఈ సినిమాను వీక్షించారు. ఆ తర్వాత చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌తో మాట్లాడారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నెల్సన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘జైలర్‌’ సినిమాను వీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ గారికి ధన్యవాదాలు. సినిమా చూశాక మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన ప్రశంసలు నాలో స్ఫూర్తిని నింపాయి. మీ మాటలతో చిత్రబృందం ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చారు నెల్సన్‌ దిలీప్‌.

ఇక ఈ సినిమా విజయం పట్ల ఈ సినిమాలో అతిథి పాత్రలు చేసిన ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. మాఫియా, ప్ర‌తీకార నేప‌థ్యం, కుటుంబ బంధాల మేళ‌వింపుగా తెరకెక్కిన చిత్రం ‘జైలర్‌’. రిటైర్డ్ పోలీస్ అధికారి ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ జీవితం ఆధారంగా ఈ సినిమాను సిద్ధం చేశారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus