Jr NTR: తారక్ పొలిటికల్ ఎంట్రీపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • November 5, 2022 / 03:00 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని సాధారణ ప్రజల్లో సైతం భావన ఉంది. ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అని యాంకర్ అడగగా బాలకృష్ణ గారి ప్రమేయం ఇప్పటికే ఉందని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో రారో కచ్చితంగా చెప్పలేనని తారక్ ప్రస్తుతం కెరీర్ పై ప్రధానంగా దృష్టి పెట్టాడని తమ్మారెడ్డి అన్నారు.

ఇప్పుడు తారక్ రాజకీయాల్లోకి వస్తాడని నేనైతే అనుకోవడం లేదని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు. ఈ ఎలక్షన్ కు అయితే తారక్ రాజకీయాల్లోకి రాడని తర్వాత ఎలక్షన్ కు తారక్ రాజకీయాల్లోకి వస్తాడేమో చెప్పలేమని తమ్మారెడ్డి వెల్లడించడం గమనార్హం. రాజకీయాల్లో సక్సెస్ కావాలనే ఆకాంక్ష జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని మంచి టైమ్ చూసి తారక్ రాజకీయాల్లోకి వస్తాడని తమ్మారెడ్డి వెల్లడించారు. తారక్ పొలిటికల్ కెరీర్ గురించి తమ్మారెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భవిష్యత్తులో తారక్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాజకీయాలకు సంబంధించి తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తారక్ సినిమాల్లోనే కొనసాగుతూ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేస్తున్నారు.

తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. త్వరలో కొరటాల శివ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ లో తారక్ పాల్గొననున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా దాదాపుగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus