రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’(Mutton Soup). ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఇటీవలె విడుదల చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక మంగళవారం నాడు (ఆగస్ట్ 26) ‘మటన్ సూప్’ నుంచి ‘హర హర శంకర’ సాంగ్‌ను ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి గారు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ..
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ‘మటన్ సూప్’చిత్రం పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త రక్తం వస్తోంది. నలభై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు. ‘మటన్ సూప్’ టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘మా ‘మటన్ సూప్’ చిత్రంలోని ‘హర హర శంకర’ పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల గారికి థాంక్స్. నన్ను ముందుండి నడిపిస్తున్న మా పర్వతనేని రాంబాబు గారికి ధన్యవాదాలు. అడిగిన వెంటనే సాయం చేసిన శివ గారికి థాంక్స్. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేదుకు ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.
నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘తనికెళ్ల భరణి గారు మా పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన రావడంతో మాకు స్వయంగా ఆ శివుడే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడే మేం విజయం సాధించినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.
నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘తనికెళ్ల భరణి గారు రావడమే మా మొదటి విజయం. మా తమ్ముడు రామచంద్రను ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘మటన్ సూప్’ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలి’ అని అన్నారు.
నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ .. ‘మా పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి గారికి థాంక్స్. సినిమాల్లో చూస్తూ పెరిగిన నేను ఈ రోజు ఇలా ఆయన పక్కన నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా కోసం ఆ శివుడే తరలి వచ్చినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.
శివ మల్లాల మాట్లాడుతూ .. ‘‘హర హర శంకర’ అనగానే అందరికీ తనికెళ్ల భరణి గారు గుర్తుకు వస్తున్నారు. ‘మటన్ సూప్’ చిత్రం కోసం ఆయన రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
హీరో రమణ్ మాట్లాడుతూ .. ‘‘మా పాటను విడుదల చేసిన తనికెళ్ల భరణి గారికి థాంక్స్. మేమంతా ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. ప్రతీ సీన్ జీవితంలో జరిగినట్టుగానే అనిపిస్తుంది. ఈ పాటను వింటుంటూ నాకు కన్నీళ్లు వస్తాయి. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నటి సునీత మనోహర్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ మూవీని ఎంతో కష్టపడి చేశాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కానుంది’ అని అన్నారు.
నటుడు గోవింద్ మాట్లాడుతూ.. ‘మటన్ సూప్ సినిమాకి పని చేయడం ఆనందంగా ఉంది. హర హర శంకర పాటను రిలీజ్ చేసిన తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామ కృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొని తనికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మట్టి వినాయకుడి విగ్రహాన్ని అందించారు.
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల