రంగు సినిమా రిలీజ్ కాదు కదా కనీసం పోస్టర్ కూడా పడనివ్వం

  • November 12, 2018 / 08:02 AM IST

“నచ్చావులే” సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన బాలనటుడు తనీష్ ఆ తర్వాత రెండు మూడు హిట్స్ కొట్టినప్పటికీ.. కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వలన వరుస ఫ్లాప్ లతో తనీష్ కెరీర్ అటకెక్కింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “నక్షత్రం” చిత్రంలో విలన్ గా నటించినా కూడా తనీష్ కి పెద్దగా ఉపయోగపడలేదు. పైగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో తనీష్ కెరీర్ కి ఆ సినిమా మరో మైనస్ గా నిలిచింది. అయితే.. “బిగ్ బాస్”తో తన ఉనికిని కాస్త గట్టిగా చాటుకొన్న తనీష్ “బిగ్ బాస్” షోకి వెళ్లడానికి ముందు నటించిన “రంగు” అనే చిత్రాన్ని ఈనెలలో విడుదల చేద్దామనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఈ సినిమాకి కొత్త సమస్య తలెత్తింది. విజయవాడలో నివసించిన లారా అనే వ్యక్తి జీవితం ఆధారంగా నిర్మించిన ‘రంగు’ సినిమా పై అభ్యతరాలు ఉన్నాయని ‘లారా’ కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం లారా (పవన్ కుమార్) గురించి విజయవాడలో సమాచారం సేకరించ డానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ చూసాము.

లారా అనే రౌడీ షీటర్ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలు అయ్యింది. లారా మీద రౌడీ షీట్ అన్యాయం గా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకు కుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి. లారా కొంతమంది దృష్టిలో రౌడీ కావొచ్చు, కానీ లారా ఎంత మంచి వాడో విజయ వాడ లో చాలామంది కి తెలుసు. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుండి దర్శక నిర్మాతల ను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారం తోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ కూడా పడనీయం. లారా గురించి వీరికి అసలు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాం ? అని లారా సన్నిహితులు డైరెక్ట్ గా సవాలు విసిరారు. మరి ఈ గొడవ తనీష్ సినిమాకి పబ్లిసిటీలా పనికొస్తుందా లేక ఎఫెక్ట్ అవుతుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus