ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో ‘గేమ్ ఓవర్’

‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. ఇంతకు ముందు విడుదల అయిన చిత్రం టీజర్, కొద్దిరోజుల క్రితం విడుదల అయిన ‘గేమ్ ఓవర్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. మూడు భాషల్లో ని నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖులు ‘గేమ్ ఓవర్’ ట్రైలర్ ను చూసి ప్రశంశలతో ట్వీట్స్ చేయటంతో ప్రేక్షకులలో ఈ చిత్రం పై అంచనాలు మరింతగా పెరిగాయి.. ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాని కి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తూ ఉండటం మరో విశేషం..తాప్సి ప్రధాన పాత్రలో , ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం.

వెన్నులో వణుకు పుట్టించే కథ, కధనాలు ఈ థ్రిల్లర్ మూవీ సొంతం. సినిమా ప్రోమోషన్ లో భాగంగా త్వరలో నాయిక తాప్సి తెలుగు మీడియాను కలువనున్నారు. తమ సంస్థ గతంలో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’ నిలుస్తుందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్.

కథానాయిక ‘తాప్సి’ మాట్లాడుతూ..’గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుందని తెలిపారు.దీనికి కారణం దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాల సమాహారం అలాగే చిత్ర నేపధ్య సంగీతం కూడా అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus