Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

తారక్‌ సన్నిహితులు, అతనిలో ఎక్కువ సినిమాల్లో పని చేసిన వారు ఎన్టీఆర్‌ గురించి చెప్పినప్పుడు కుకింగ్‌ టాలెంట్‌ గురించి బాగా మాట్లాడతారు. ‘బిగ్‌బాస్‌’ టీవీ షో హోస్ట్‌ చేసిన తర్వాత అతని కుకింగ్‌ టాలెంట్‌ గురించి అందరికీ తెలిసింది. ఓ ఎపిసోడ్‌లో బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్ల కోసం వండి వడ్డించాడు కూడా. అలా తారక్‌లో చెఫ్‌ గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో చెఫ్‌ తారక్‌ స్పెషల్‌ అంటే అందరూ బిరియానీనే అనుకుంటున్నారు. చాలామంది ఇదే మాట కూడా చెప్పారు. అయితే స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరో ఐటెమ్‌ కూడా ఉందట.

Tarak

‘వార్‌ 2’ సినిమా ప్రచారం కోసం తారక్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రముఖ మ్యాగజీన్స్‌కి ఎస్క్వైర్‌ ఇంగియాకి కూడా ఇలానే కవర్‌ పేజీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తారక్‌ చెప్పిన కొన్ని విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందులోనే తారక్‌ తన చెఫ్‌ టాలెంట్‌ గురించి కూడా చెప్పాడు. తాను నటుడిని మాత్రమే కాదని గొప్ప చెఫ్‌నని కూడా చెప్పాడు ఎన్టీఆర్‌. తన సన్నిహితుల కోసం అప్పుడప్పుడు వండుతుంటాను అని కూడా చెప్పాడు.

 

నా భార్య ప్రణతి కోసం, నా స్నేహితుల కోసం వంట చేయడం నాకు చాలా ఇష్టం. పునుగులు బాగా వేస్తాను. అంతేకాదు నేను వండే బిర్యానీ కూడా నచ్చుతుంది అని తారక్‌ తన ఫేవరెట్‌ ఫుడ్‌, కుకింగ్‌ గురించి చెప్పాడు. దీంతో తారక్‌ చెఫ్‌ టాలెంట్‌ గురించి తెలిసింది. ఈ క్రమంలో పునుగులు లవర్స్‌ తెగ హ్యాపీ ఫీలవుతున్నారు. మా హీరోకి మా లాగే పునుగులు అంటే ఇష్టమని సంబరపడిపోతున్నారు. ఇక ‘వార్‌ 2’ సినిమా విషయానికొస్తే తారక్‌, హృతిక్‌ రోషన్‌ కలసి నటించిన సినిమా ఇది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో కియారా అద్వాణీ కథానాయిక.

మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus