యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ అలాంటి తప్పు మాత్రం చేయకూడదని తారక్ అభిమానులు సూచిస్తున్నారు. తారక్ బీజేపీ తరపున ప్రచారం చేస్తే ఇతర పార్టీలకు శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలు తారక్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
తారక్ ప్రస్తుతం సినిమాల పరంగా ఊహించని రేంజ్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. తారక్ డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తారక్ సినిమా ఇండస్ట్రీకి పరిమితమైతేనే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న అభిమానులు సైతం ఇప్పుడు తారక్ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు తర్వాత ప్రాజెక్ట్ లు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.
ఈ రెండు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో తారక్ కెరీర్ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. తారక్ రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లే ఆయన కెరీర్ కు మేలు జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తారక్ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?