‘ఎన్టీఆర్’ పై…’ఎన్టీఆర్’ కామెంట్స్!!!

నందమూరి వంశంలో వచ్చిన విభేదాలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్- బాలయ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం వాళ్లిద్దరినీ చూస్తుంటే తెలుస్తుంది. అయితే వారిరువురి మధ్య గొడవలు మొదలైనప్పటినుంచీ బాలయ్య, నందమూరి తారకరత్న,నారా రోహిత్ అంతా కలసి ఉండగా, హరికృష్ణతో నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఉంటున్నారు. అయితే అదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ పై నందమూరి తారక రత్న చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ హాట్ మారాయి.ప్రస్తుతం నారా రోహిత్ ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన తారకరత్న ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు…

ఇంతకీ తారక రత్న ఏమన్నాడంటే…ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి విభేధాలు లేవని.. తాను, ఎన్టీఆర్, కళ్యాణ్ రాం అప్పుడప్పుడు కలుస్తుంటాం అని అంటూనే….అంటే మీకు కనిపించేలాగా కలవకపోతే మేము దూరంగా ఉంటున్నట్లేనా అని మీడియాను ప్రశ్నించాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, తనకూ…జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి గొడవలు లేవని వీలున్నప్పుడల్లా కలుస్తామని అన్న తారకరత్న, మరి సావిత్రి ఆడియోలో నందమూరి వారసత్వాన్ని మోసింది బాలయ్య బాబే.. బాబాయ్ వెనుకే ఉంటాం అంటూ బాలకృష్ణ ముందు చెప్పిన తారకరత్న ఇప్పుడు తారక్ తో గొడవలు ఏమి లేవనడం కాస్త ఆశ్చర్యంగా ఉంది అని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా…బాలయ్యతోనే మా పయనం అంటున్న తారకరత్నకు ఈ సినిమా అయినా మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus