హాలీవుడ్ స్టార్ హీరోపై భార్య సంచలన కామెంట్స్!

ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డెప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్ పై వేసిన పరువు నష్టం దావత్ కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు జానీ డెప్ తనను తరచూ కొడుతుండేవాడని.. తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది.

దీంతో తనపై అంబర్ ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ.380 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్ లో అంబర్, జానీ డెప్ పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడని.. అసభ్యపదజాలంతో దూషించేవాడని చెప్పుకొచ్చింది.

మొదటిసారి తన టాటూని చూసి నవ్వినందుకు కొట్టాడని చెప్పింది. జానీ శరీరంపై చెదిరి ఉన్న టాటూ ఏంటని అడగ్గా.. విన్నో(జానీ డెప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానమిచ్చాడట. అది జోక్ అనుకొని నవ్విందట అంబర్. దీంతో జానీ ఆమె చెంపపై కొట్టి సరదాగా ఉందా..? అంటూ ఆమెని బూతులు తిట్టాడట. ఆ సమయంలో తనకు ఏం అర్ధం కాలేదని.. షాక్ తో అతనివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది.

జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని.. మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తూ.. భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనల గురించి తనతో మాట్లాడేవాడని పేర్కొంది. అలానే ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకొని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీర భాగాల్లో కొకైన్ కోసం వెతికాడని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది అంబర్.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus