తిక్క, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ వంటి అపజయాలను చూసిన తర్వాత సాయి ధరమ్ తేజ్ మంచి కథని ఎంచుకున్నారని.. “తేజ్ ఐ లవ్ యు” టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకున్నారు. మెగా హీరో, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్.. కరుణాకరన్ పిశ్చరైజేషన్ బాగున్నాయని ట్రైలర్ చూసి నమ్మేశారు. భారీ హిట్ ఖాయమని భావించి తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 14.15 కోట్లకు (అన్ని ఏరియాలు కలుపుకొని) కొనుగోలు చేశారు. ఇంత బిజినెస్ చేసిన మూవీ తప్పకుండా ఓ రేంజ్ లో ఉంటుందని థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుడు నిరాశతో బయటికి వస్తున్నాడు. మిశ్రమ టాక్ అందుకోవడంతో రెండో ఆట నుంచే థియేటర్లు నిండడం కష్టమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 650 కి పైగా థియేటర్స్ లో నిన్న(శుక్రవారం) రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు 1.8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ఇది సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ ఓపెనింగ్ కలక్షన్స్ కంటే ఎక్కువైనప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్స్ సంతోషపడే కలక్షన్స్ మాత్రం కాదని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. ఏరియాల వారీగా “తేజ్ ఐ లవ్ యు” ఫస్ట్ డే కలెక్షన్స్ (షేర్) …
ఏరియా : కలక్షన్స్ నైజాం : 70 లక్షలు సీడెడ్ : 32 లక్షలు ఉత్తరాంధ్ర : 26 లక్షలు గుంటూరు : 25 లక్షలు కృష్ణ :12 లక్షలు ఈస్ట్ గోదావరి :15 లక్షలు వెస్ట్ గోదావరి :12 లక్షలు నెల్లూరు :06 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : 1.8 కోట్లు