సాయి ధరమ్ తేజ్ మూవీపై క్రేజ్ మామూలుగా లేదుగా !

సాధారణంగా స్టార్ హీరోలపై హిట్, ప్లాప్ ల ప్రభావం ఎక్కువగా ఉండదు. వారి స్థాయికి అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంటాయి. అదే విధంగా మెగా హీరో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ కొత్తల్లో పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో అదరగొట్టారు. ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. అతను చేసిన తిక్క, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్‌ సినిమాలు ప్లాప్ అయ్యాయి. వరుసగా మూడు సినిమాలు పోయిందంటే అతనికి కనుచూపుమేరలో నిర్మాతలు కనిపించరు. అటువంటిది చేతినందిందా సినిమాలతో మెగా హీరో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం తేజు కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. కెఎస్ రామారావు నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. నైజాం 4 కోట్లు, సీడెడ్ 2.7 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 14.15 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు అందించాలంటే 15 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి అన్ని కోట్లు ఎన్నిరోజుల్లో వసూలు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus