గురువు మాటలు.. శిష్యుడి చేతలు

  • October 14, 2017 / 01:48 PM IST

‘ఎన్టీయార్ బయోపిక్’ను నేను తీస్తానంటే నేను తీస్తానంటూ రాంగోపాల్ వర్మ మరియు ఆయన శిష్యుడు తేజ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. రాంగోపాల్ వర్మ తీయబోయేది లక్ష్మీపార్వతి వెర్షన్ ఆఫ్ “ఎన్టీయార్ బయోపిక్” కాగా.. తేజ తీయబోయేది బాలయ్యకు తెలిసిన ఎన్టీయార్ జీవితం. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఆర్జీవితో పోల్చి చూస్తే తేజ ముందడుగులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న “ఎన్టీయార్ బయోపిక్” ప్రీప్రోడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలైంది.

అయితే.. ఆర్జీవి మాత్రం ఇంకా వర్క్ మొదలెట్టకుండా ఇంకా ఎనౌన్స్ మెంట్లు, పొలిటీషియన్స్ తో ముచ్చట్లు, సోషల్ మీడియాలో కొందరికి వంకర సమాధానాలు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాడు. నిజానికి.. ఆర్జీవి సినిమా మొదలెట్టాడంటే పూర్తవ్వడం పెద్ద పనేమీ కాదు. కానీ.. ప్రస్తుతానికైతే ఆర్జీవి కంటే తేజ ఒక పదడుగుల ముందే ఉన్నాడు. ఆ విధంగా గురువు (ఆర్జీవి) మాటలతో టైమ్ పాస్ చేస్తుంటే.. శిష్యుడు (తేజ) మాత్రం చేతలు మొదలెట్టి.. సినిమాను ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా మే 28న విడుదల కూడా చేస్తానంటూ ఎనౌన్స్ చేసేశాడు. ఒకవేళ నిజంగా తేజ గనుక ఆర్జీవి వెర్షన్ కంటే ముందే “ఎన్టీయార్ బయోపిక్”ను రిలీజ్ చేస్తే రాంగోపాల్ వర్మ తెరకెక్కీంచే చిత్రాన్ని చూడ్డానికి థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus