బాహుబలి 2 సినిమాకి అన్నీ కలిసి వస్తున్నాయి. ఒక్కొక్క అడ్డంకి తొలిగిపోయి ప్రేక్షకుని వద్దకి పరుగులుతీస్తూ వస్తోంది. మొన్న కర్ణాటక వివాదం ముగిసి పోగా, నేడు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి అభిమానులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే వీలైనన్ని షోలు ప్రదర్శించడానికి ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఈరోజు ‘బాహుబలి- ది కంక్లూజన్’ కు తెలంగాణ ప్రభుత్వం సూపర్ ఆఫర్ ఇచ్చింది.
రిలీజైన తర్వాత మొదటి 10 రోజుల వరకు అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం, ఆ తర్వాత నుంచి నాలుగు కాకుండా ఐదు షోలు వేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ దేవినేని మీడియాతో చెప్పారు. అడిగిన వెంటనే అనుకూలంగా స్పందించి అనుమతిచ్చిన తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలని తెలిపారు. ఈ ప్రోత్సాహం వల్ల నిర్మాతలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.