Pushpa 2: ‘పుష్ప: ది రూల్‌’ టికెట్‌ ధరలు తేలిపోయాయ్‌.. ఎంత ఎక్కువ పెట్టాలంటే?

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతోంది. దీంతో టికెట్ ధరలు ఎంత ఉండొచ్చు అనే చర్చనే గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఎందుకంటే భారీ బడ్జెట్‌, అతి భారీ తారాగణంతో వస్తున్న సీక్వెల్‌ ఇది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఇప్పటికే సినిమా టీమ్‌ తమ రిక్వెస్ట్‌లు చేసింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని అడిగింది. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలు, ప్రీమియర్‌ షో టికెట్‌ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చింది.

Pushpa 2

అల్లు అర్జున్‌ (Allu Arjun)  కథానాయకుడిగా సుకుమార్  (Sukumar)  దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాను డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి లభించింది.

4న వేసే రాత్రి 9.30 షోకు టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచుకోవచ్చని పేర్కొంది. సింగిల్ స్క్రీన్ కానీ మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లిస్తేనే ‘పుష్ప 2’ 4న రాత్రి చూడొచ్చు. సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. 5న అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిచ్చారు.

డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకోవచ్చు. డిసెంబర్ 9 నుండి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 వరకు పెంచుకోవచ్చు. డిసెంబర్ 17 నుండి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ‘పుష్ప’రాజ్‌ రూల్‌ చూడటానికి జేబు భారీగానే ఖాళీ అవుతుందన్నమాట.

అందరి పర్మిషన్ తీసుకున్నాను.. మీకెందుకు చెప్పాలి : వైవిఎస్ చౌదరి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus