చిరంజీవికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకంటే?

  • March 15, 2023 / 12:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో కెరీర్ పరంగా జోరుమీదున్నారు. భోళా శంకర్ సినిమాతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే చిరంజీవి ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

నిన్న తెలంగాణ హైకోర్టులో ప్రజల అవసరాల కొరకు కేటాయించిన స్థలంను చిరంజీవికి విక్రయించారనే ఆరోపణల పిటిషన్ పై విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు చిరంజీవికి ఈ స్థలం విషయంలో కీలక సూచనలు చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో నిర్మాణంపై స్టే విధించాలని అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ నెల 25వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

చిరంజీవి, సొసైటీ ఈ పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ వివాదం గురించి చిరంజీవి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. నిజ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. చిరంజీవి స్పందిస్తే మాత్రమే ఆ స్థలాన్ని చిరంజీవి కొనుగోలు చేయడం వెనుక ఉన్న కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. చిరంజీవి ఎలాంటి తప్పు చేయరని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది మెగా కుటుంబంలోని హీరోలకు వరుస విజయాలు దక్కడంతో పాటు రామ్ చరణ్ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతోంది. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో చిరంజీవి పుత్రోత్సాహంతో ఎంతో సంతోషిస్తున్నారు. చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. వరుస విజయాలతో మెగాస్టార్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవి 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తున్నారని వినిపిస్తుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus